Oct 26,2022 23:11

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు


మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా
ప్రజాశక్తి -గాజువాక :
జిఒలు 301, 296, 388లపై ఉన్న ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తేయాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే గాజువాక భూసమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే నాగిరెడ్డి, మూడున్నరేళ్లు గడిచిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.జిఒల్లోని లోపాలను సవరించకపోవడంతో 26వేల కుటుంబాలకు ప్లాన్‌ అప్రూవల్‌ కావడం లేదని, పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే, కొత్త గాజువాకలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి కార్పొరేటర్లు జగన్‌, ముత్యాలనాయుడు, పల్లా శ్రీనివాసరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.