Jan 13,2023 22:22

ప్రజాశక్తి - కలిదిండి
         రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ నెం.1ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన స్థానిక ప్రధాన సెంటర్‌లో శుక్రవారం ఆ జిఒ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి ప్రసాద్‌ మాట్లాడుతూ ఆ జిఒను ఉపసంహరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళరావు, నేతలు వీరవల్లి భాస్కరరావు, అద్దాని వెంకటేశ్వరరావు, పాతపాటి జ్ఞానేష్‌, కార్యకర్తలు ముంగం సురేష్‌, కుడిపూడి శ్రీనివాసరావు, గద్దె అనిల్‌ కుమార్‌, జక్కుల మహేష్‌, పంతగాని ప్రకాష్‌, చిన్నం శ్రీకాంత్‌, పెరుమాళ్ల సత్యన్నారాయణ, రమేష్‌, జోజిబాబు, బుస్సా నాగేంద్రం పాల్గొన్నారు.
చింతలపూడి : జిఒ1 అమలైతే పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఎఐటియుసి జిల్లా కో కన్వీనర్‌ తొర్లపాటి బాబు అన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిర్బంధాలను విధిస్తూ తీసుకొచ్చిన ఈ జిఒను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి ఆధ్వర్యంలో జిఒ కాపీలను స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలంనాటి జిఒను వైసిపి ప్రభుత్వం తీసుకురావడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని, తక్షణం ఈ జిఒను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఎఐటియుసి నాయకులు పుప్పాల సత్యనారాయణ, దేవినేని రమేష్‌, దేవినేని ప్రసాద్‌, శ్రీనివాస్‌, రమేష్‌, వెంకటేశ్వరరావు, తిరుమల శ్రీనివాస్‌ ఉన్నారు.