ప్రజాశక్తి - ఏలూరు
ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే జిఒ 1ని రద్దు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా స్థానిక గాంధీ మైదానంలో అఖిలపక్ష నాయకులు జిఒ1పై నిరసన తెలుపుతూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పళ్లెం కిషోర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, జనసేన ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి జగన్ నియంత మాదిరిగా జిఒ1ని తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరునికి కల్పిస్తే వైసిపి ప్రభుత్వం వాటిని హరిస్తూ పౌర హక్కులను కాలరాస్తుందన్నారు. జగన్ నియంతృత్వ పాలనకు ఈ జిఒ నిదర్శనమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచేందుకు వైసిపి ప్రభుత్వం అక్రమంగా జిఒలు విడుదల చేసిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకువచ్చి ప్రతిపక్షాల ఉద్యమాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, సిపిఎం నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్, బి.సోమయ్య, కె.శ్రీనివాస్, జగన్నాథరావు, వైఎస్.కనకారావు, ఏసుబబు, కోటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బద్దావెంకట్రావు, కాకర్ల అప్పారావు, ఎర్ర శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు ఇళ్ల శ్రీనివాస్, కస్తూరి తేజస్విని, కాశీ నరేష్, గుబ్బల నాగేశ్వరరావు, అఖిలపక్ష నాయకులు ఎస్.సాయిబాబా, వరప్రసాద్, గేదెల నాగేశ్వరరావు, విజయ, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, పోలా భాస్కర్, శ్రీను, అల్లు సాయిచరణ్, పైడి లక్ష్మణరావు, బొండా రాము, వీరి నాయుడు, రాము, రమణ, భూపతి రాఘవ, కొండ శివ, బ్రహ్మం, నరసింహమూర్తి, కోటేశ్వరరావు, నూకరాజు, కోరాడ అప్పారావు, క్రాంతి, సుజాత, ప్రమీళ, సరళ, సుజాత, ఉమాదుర్గ పాల్గొన్నారు.
నూజివీడు : జిఒ1ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎ.రవి మాట్లాడుతూ ప్రజాసమస్యలపై గళమెత్తే అవకాశం లేకుండా నియంతృత్వ థోరణితో వైసిపి ఇటీవల తెచ్చిన జిఒ1ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస ఆలోచన చేయకుండా బ్రిటిష్ కాలంలో అమలు చేసిన జిఒను వైసిపి ప్రభుత్వం అమలుపరచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకష్ణ, సిఐటియు నాయకులు రాజు, దుర్గారావు, పాపారావు, సత్తు కోటేశ్వరరావు, ఐద్వా నాయకురాలు పద్మాంజలి, హోలీమేరీ పాల్గొన్నారు.
టి.నరసాపురం : జిఒ 1ని రద్దు చేయాలని కోరుతూ టి.నరసాపురంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిఒ నెంబర్ ఒకటి రద్దు చేయాలని కోరుతూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఒపై అన్ని ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు తుమ్మల సత్యనారాయణ, మడకం సుధారాణి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనుములు మురళీ పాల్గొన్నారు.










