ప్రజాశక్తి-విజయవాడరూరల్
జగన్‌రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి చీకటి జీవోను చంద్రబాబు యాత్రలు, లోకేష్ యువగళంలను అడ్డుకోవడానికి తీసుకొచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడి లో జి. ఓ. నంబర్ 1 ప్రతులను దగ్ధం, ఆందోళన కార్యక్రమం గురువారం జరిగింది. ఆయన తోపాటు పార్టీ శ్రేణులు ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ లు భారీగా మోహరించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బ్రిటిష్ వారి కంటే దారుణంగా జగన్ పాలన చేస్తున్నారు. చివరకు ఒక ఎన్నారై కానుకలు ఇస్తే తగిన బందోబస్తును పెట్టలేకపోయారన్నారు. చంద్ర బాబుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి వైసిపి నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు.










