Apr 06,2023 21:30

సమావేశంలో మాట్లాడుతున్నఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం.రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ నాయక్‌

జిఒ 52ను రద్దు చేయాలి
ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో అనుమతించం
ప్రజాశక్తి - ఆత్మకూరు

      జీవో 52ను రద్దు చేయాలని, ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో అనుమతించబోమని బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని శాసన సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేసిన దానిని రద్దు చేయాలని, ఈ నెల 9న కర్నూల్‌ పట్టణంలోని వెంకయపల్లి అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్న శ్రీనివాస్‌ గార్డెన్‌లో జరగబోయే ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం సమావేశంను జయప్రదం చేయాలని కోరారు. 52 జీవోపై భవిష్యత్‌ కార్యాచరణపై జాతి పెద్దల సమక్షంలో వారి సూచనలు, సలహాలతో ముందుకు సాగుతామని అన్నారు. తండాలలోచ, గూడెలలో అభివృద్ధికి ఆమడ దూరంలో వుండి ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్న గిరిజన జాతిలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాల్మీకులను 52 జీవో పేరుతో తీసుకువచ్చి ఎస్టీ జాబితాలో చేరిస్తే జాతి బిడ్డల భవిష్యత్తు ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని తండాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విక్రమ్‌ సింహ నాయక్‌, అడ్వకేట్‌ విజరు నాయక్‌, డుమావతస్వామి నాయక్‌, వెలుగోడు మండల ఉపాధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, నీలా నాయక్‌, సురేష్‌ నాయక్‌, బిలావత్‌ సుధాకర్‌ నాయక్‌, గుంతకందాల డుమావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌, జమ్మి నగర్‌ నాగేష్‌ నాయక్‌, వెంకట శివా నాయక్‌, సురేష్‌ నాయక్‌, రామకోటి నాయక్‌, జడల నాయక్‌, సుబ్బా నాయక్‌, నాగ స్వామి నాయక్‌, తిమ్మా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు