ప్రజాశక్తి మారేడుమిల్లి :బోయ వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చొద్దంటూ శనివారం నాడు స్థానిక పాత ఎంపీడీవో కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్యర్యంలో జిఓ 52 కాపీలను దగ్ధం చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైదాన ప్రాంతంలో ఉన్న బోయ/వాల్మీకులు, బొంతు కోరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చి గిరిజనులకు తీవ్ర అన్యాయం చెయ్యాలని కుట్ర పన్నుతుందని తెలిపారు. దీనిని గిరిజనులందరూ ఐక్యంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. జిఒ 52ని వెంటనే రద్దు చేయకుంటే గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఇ.సిరిమల్లిరెడ్డి, ఎం.వాణిశ్రీ, మండల నాయకులు ఇ.సత్యనారాయణ రెడ్డి, వేటుకూరు సర్పంచ్ ఇ.మల్లీశ్వరి, కె.గంగిరెడ్డి, బి.మల్లిరెడ్డి, ఆర్.జానకి రెడ్డి పాల్గొన్నారు.
గిరిజన సంఘం ర్యాలీ
ప్రజాశక్తి -హుకుంపేట: బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చడం తగదని గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు బజారు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, ఇప్పటికే గిరిజనులు అభివృద్ధిలో ఇతర వర్గాల కన్నా వెనకబడి ఉన్నారని, నీళ్లు, రోడ్లు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిఒ 52న తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణలు, గిరిజన సం సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబులులు 52 జీవోపై వారి వైఖరి తెలియ జేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కిల్లో రామారావు, సీఐటీయూ మండల కార్యదర్శి సొంటేన హైమావతి, మండల వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, మండల నాయకులు వలసనైని లక్ష్మణ్‌రావు, కొర్ర అప్పారావు, ప్రజలు పాంగి సుభద్ర, పాంగి బొంజుబాబు, కొర్ర కృష్ణ పాల్గొన్నారు.










