ప్రజాశక్తి-యంత్రాంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరే విధానాలపై సెప్టెంబర్ నాలుగ తేదీ వరకు సమరభేరిని ఆ పార్టీ నేతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మన్యంలోని పలు మండలాల్లో సిపిఎం నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సిపిఎం నేతలు విమర్శించారు.
పాడేరు:జీఓ 3కు చట్టబద్ధత కల్పించడంలో జగన్ ప్రభుత్వం ఆదివాసీలను తీవ్రంగా మోసం చేసిందని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస ధ్వజమెత్తారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదివాసి వ్యతిరేక విదానాలపై సిపిఎం సమర భేరి కార్యక్రమాన్ని బుధవారం పాడేరు పి.ఎం.అర్.సి కాలనీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఇంటి ఇంటికి పంపిణీ చేశారు. పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభల్లో అప్పల నర్శ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరే విధానాల పై సెప్టెంబర్ నాలుగ తేదీ వరకు సమరభేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. సుమారు 20, వేల మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పోస్టుల ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సిఎం జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ట్రు అప్ చార్జీల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిందన్నారు.ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాడేరు మండల కమిటీ కార్యదర్శి ఎల్.సుందర్‌రావు, పార్టీ నాయకులు కొండబాబు, పార్వతమ్మ, వరహాలమ్మ, వంతల దాసు, ప్రభుదాసు పాల్గొన్నారు.
పాడేరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజరు పిలుపునిచ్చారు. సిపిఎం సమరభేరీలో భాగంగా బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని వారపు సంతలో సంతకాల సేకరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి, మజ్జి రాంబాబు పాల్గొన్నారు
అరకులోయ రూరల్: మండల కేంద్రంలోని సంతకల సేకరణ చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి కిండంగి రామారావు, మాట్లాడుతూ, విపరీతంగా ధరలు పెంచి పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. కాంట్రాక్ట్, ఔట్సో ర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్యారావు, మహాదేవ్, సహదేవ్, జొయో, గోపాల్, అర్జున్ పాల్గొన్నారు.
సంతలో ప్రచారం
చింతూరు : నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సమరభేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులు బుధవారం చింతూరు సంతలో కరపత్రాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ 2022 వరదలను ప్రామాణికంగా తీసుకొని నిర్వాసిత గ్రామాలను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు పల్లపు వెంకట్, మడకం చిన్నయ్య, పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, ఎంపీటీసీ వేక రాజ్ కుమార్, కలుముల మల్లేష్, కుంజ శ్రీను, గుర్రం పిడకయ్య, రామిరెడ్డి, సారపు కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విఆర్.పురం : మండలంలోని గ్రామాలలో సిపిఎం నాయకులు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మండల నాయకులు సోడి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు గుట్టల శ్రీను, నాల్లారపు ప్రకాష్ రావు, ముంజపు రామచంద్రం, ముత్యాల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ఎటపాక : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టిన సమరభేరి పోస్టర్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సోందే రామారావు, కాక అర్జున్ దొర, ఆకిశెట్టి రాము, సోయం వీరమ్మ, కారం జయమ్మ పాల్గొన్నారు.
కూనవరం : సమారభేరి పోస్టర్‌ను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న సచివాలయ పరిధిలోనూ, 4న ఎమ్మార్వో ఆఫీసుల ముందు చేస్తున్నట్లు ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, తలగాని నాగరాజు నోముల సత్యనారాయణ, వెంకన్న బాబు, వీరబాబు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.










