
ప్రజాశక్తి - పోడూరు
మండలంలోని జిన్నూరు గ్రామంలో జిన్నూరు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాలకొల్లు యూనిట్ ద్వారా శనివారం ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం నిర్వహించారు. యూత్ హాస్టల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు, యూత్ హాస్టల్ ఫౌండర్ రిచర్డ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో వంద మందికి పైగా పాల్గొన్న వారికి నేత్ర, దంత సేవలను డాక్టర్ చల్లా హేమంత మాదూర్, డాక్టర్ కావలి మౌని, లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్దిబోట్ల లక్ష్మీనారాయణ, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు భూపతిరాజు, అచ్యుత రామరాజు, పాలకొల్లు యూనిట్ ఛైర్మన్ కారుమూరి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు కొట్టి భాస్కరరావు, లయన్స్ ఐ హాస్పిటల్ ట్రెజరర్ కెవి.నరసింహం, ఐడియల్ స్కూల్ వ్యవస్థాపకులు ఆచంట వెంకట సుబ్బారావు, సభ్యులు బికె.విశ్వనాథ్, పెన్మత్స ప్రతాపరాజు, శ్రీకాంత్, బలభద్ర బాల రెడ్డియ్య, నాళం వెంకటరామయ్య, ఎంఎస్‌ఆర్‌సి గుప్త, వివిఎస్‌ఎన్.మూర్తి పాల్గొన్నారు.