Sep 12,2023 21:35

    పోలవరం:ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి తెలిపారు. మండలంలోని జిల్లెల్లగూడెం పంచాయతీలో 'గడపగడపకు మన ప్రభుత్వం' ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోయినాగుపాలెం, రెడ్డి నాగంపాలెం, మనుగోపుల, పేడ్రాల గ్రామాల్లో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు వాలంటీర్‌ వ్యవస్థను పెట్టి ప్రజల అవసరాలను తీర్చే విధంగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.శ్రీను, సర్పంచి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.