Aug 20,2023 21:54

ప్రజాశక్తి - ఏలూరు
         శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల అధికారులు రౌడీషీటర్లను హెచ్చరించారు. జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, కైకలూరు, చింతలపూడి, తదితర తదితర సర్కిళ్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు, అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కష్టపడి పనిచేసుకుని కుటుంబాలను పోషించుకోవాలని పిల్లలను చదివించి ప్రయోజికులను చేయాలన్నారు. హింసామార్గాన్ని వీడి సమాజహితానికి పాటుపడాలని సూచించారు.