Feb 24,2023 23:44

సర్టిఫికెట్లు చూపుతున్న విద్యార్థినులు, చిత్రంలో ఎంఇఒ అప్పలరాజు

ప్రజాశక్తి-సబ్బవరం
ఈ నెల 22, 23 తేదీలలో అనకాపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. వీరు తయారు చేసిన మోడల్‌ ''పర్యావరణం - వాతావరణ మార్పులు''కు సంబంధించిన కేటగిరీలో పాల్గొని జిల్లా స్ధాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ఇన్‌ఛార్జ్‌ ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌.చిన్నమ్మాయి తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు గైడ్‌ టీచర్‌గా అర్‌.ప్రసాద్‌, విద్యార్ధిని బి.మోన్షిత నాయకత్వం వహించారు. జిల్లాస్థాయిలో ఎంపిక కావడంతో ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు ఇన్‌ఛార్జి హెచ్‌ఎం తెలిపారు. జిల్లా స్థాయి డ్రాయింగ్‌ పోటీలలో పాల్గొన్న కె.కుసుమ ద్వితీయ స్థానంలో నిలిచింది. బి.మోన్షిత రాష్ట్ర స్థాయి సైన్స్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనుటకు అర్హత సాధించడం పట్ల మండల విద్యా శాఖాధికారి యస్‌.అప్పలరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనుట ద్వారా, వారిలో దాగిఉన్న సృజనాత్మకత, ప్రేరణ, శాస్త్రీయ దృక్పథం, సైన్స్‌ పట్ల మక్కువ పెరుగుతుందని ఎంఇఒ తెలిపారు.