ప్రజాశక్తి - ఆగిరిపల్లి
జిల్లాస్థాయి పుట్‌బాల్ పోటీలకు మండల పరిధిలోని హీల్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ బి.సాయిబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన జిల్లాస్థాయి పుట్‌బాల్ పోటీలలో 14 సంవత్సరాల విభాగంలో నలుగురు బాలికలు, ఒక బాలుడు, 17 సంవత్సరాల విభాగంలో ఒక బాలిక, ముగ్గురు బాలురు ఎంపికైనట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ సాయిబాబు, కోచ్ ప్రేమ్ తేజ, ఫిజికల్ డైరెక్టర్స్ ప్రభుదాసు, శ్రీనివాసరెడ్డి, బాస్కెట్‌బాల్ కోచ్ చాందినిలు అభినందించారు.










