ప్రజాశక్తి - పెదవేగి (ఏలూరు టౌన్)
జిల్లాస్థాయి త్రోబాల్ ఎంపిక పోటీల్లో పెదవేగి మండలం రామశింగవరం జెడ్‌పిహెచ్‌ఎస్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్ 14, 17 విభాగాల్లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో తణుకులో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. అండర్-14 విభాగంలో పాఠశాలకు చెందిన చలమాల దివ్యశ్రీ, అండర్-17 విభాగంలో దుక్కిపాటి సంజన అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పిడి జమ్మా రామకృష్ణలను శనివారం పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టివి.పద్మావతి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పరసా నాగార్జున, వెలివెల శ్రీను, మేకా లక్ష్మీనారాయణ, నీలిమ, మురళీ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.










