Oct 25,2023 21:50

జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ప్రజాశక్తి- సోమల:
మండల కేంద్రమైన సోమల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం నియోజకవర్గస్థాయి టెన్నికాయిట్‌ పోటీలను అండర్‌ -17, అండర్‌ -14 విభాగంలో ఎంపిక కోసం నిర్వహించారు. ఈ పోటీలలో నియోజకవర్గ స్థాయిలోని ఆరు మండలాలకు చెందిన పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 80 మంది పాల్గొనగా వీరిలో 20 మంది క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సోమల, సూరయ్యగారిపల్లి, నంజంపేట, కందూరు, పుదిపట్ల, చంద్రమాకులపల్లి, చారాల, పూజగానిపల్లి, విజయవాణి హైస్కూల్‌కు చెందిన పలువురు క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు ఈనెల 28వ తేదీ ఎస్‌ఆర్‌ పురం మండలం చిల్లమాకులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కరుణానిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు చిన్నప్ప, శివకుమార్‌, కిషోర్‌, నూర్జహాన్‌, మురళి పాల్గొన్నారు.