ఎంపికైన విద్యార్థులతో పాఠశాల హెచ్‌ఎం, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
ప్రజాశక్తి - మారేడుమిల్లి
ఈనెల తొమ్మిది, పది తేదీలలో రంపచోడవరం డివిజన్ స్థాయిలో ముసలిమిల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగిన క్రీడలలో మారేడుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సీనియర్ విభాగం నుండి వాలీబాల్, షార్ట్ పుట్‌లో పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లోనూ, జూనియర్ విభాగం నుండి చెస్, క్యారమ్స్ ప్రథమ స్థానంలో గెలిసి జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులను, పిడి సుదర్శన్, పిఈటి కె.రామదాసు, జయప్రసాదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.రామారావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్న విష్ణు దొర అభినందించారు.










