ఎంపికైన విద్యార్థులతో సర్పంచి, ప్రధానోపాధ్యాయులు
ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎస్‌డిఎస్.జ్యోతి, సర్పంచి మొగతాల్ అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం వారుమ మాట్లాడారు. ఆలూరు తాలూకా పరిధిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొటీల్లో 19 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. పాఠశాల నుంచి కబడ్డీ అండర్- 17 పోటీలకు ముగ్గురు, కబడ్డీ అండర్-14కు ఇద్దరు, ఖోఖో అండర్-17కు ఏడుగురు, ఖోఖో అండర్-14కు ముగ్గురు, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు జిల్లా పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ ఎంపికకు కృషి చేసిన పిఇటి ఎన్.వీణ, గాదె రోషన్న, మధుసూదన్ రెడ్డి, సోషల్ ఉపాధ్యాయులను సర్పంచి ప్రత్యేకంగా అభినందించారు.










