క్రీడాకారులను అభినందిస్తున్న క్రికెట్ అసోషియేషన్ ప్రతినిధులు
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : అనంతపురంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ శిక్షణలో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ కనబరచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్టు కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి అనంతజిల్లాజట్టు తరపున ఎంపికైన అనుష్క, లిఖిత, మైత్రీని క్రికెట్ అసోషియేషన్ ధర్మవరం మండల అధ్యక్షుడు వడ్డేబాలాజీ, కార్యదర్శిశంకర్, కోచ్ రాజశేఖర్లు బుధవారం గుట్టకిందపల్లి వద్ద ఉన్న ఆర్డీటీ క్రీడామైదానంలో అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎంపికైన విద్యార్థులు వెంకటగిరిలో ఇచ్చే శిక్షణకు బయలుదేరి వెళ్లారు. క్రికెట్లో రాణించి పేరుప్రతిష్టలు తీసుకురావాలని అసోషియేషన్ అధ్యక్షుడు వడ్డే బాలాజీ కోరారు.










