Dec 19,2022 23:32

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సిఐ తదితరులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా అచ్చుతాపురం గ్రామ సర్పంచ్‌ కె విమల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను సిఐ మురళీరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు దేశం శెట్టి శంకర్రావు, జి నూకరాజు, గంగిరెడ్డి రాము, ఎంపీటీసీ సభ్యుడు డి శ్రీను, పల్లి శేషగిరిరావు, నర్మాల కుమార్‌, జి ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.