Dec 31,2022 23:04

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌ 

జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నామని, ఇందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరిం చుకుని శనివారం జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు మీడియా ప్రతిని ధులతో అయన కార్యాలయంలో ఇష్టాగోష్టి నిర్వహిం చారు. మీడియా ప్రతినిధులతో అయన మాట్లాడుతూ జిల్లాల పునః వ్యవస్తీకరణ నేపథ్యంలో ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లాను అభివద్ధి పధంలో నిలిపేందుకు అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తనవంతు కషి చేస్తున్నానన్నారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను సాదించ గలిగామన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతి నిధులు అందించిన సలహాలు, సూచనలు తనకెంతగానో ప్రేరణ కల్పించామన్నారు. ఇదే స్పూర్తితో రానున్న నూతన సంవత్సరం మరింత అభివద్ధి పధంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కషి చేస్తున్నా మన్నారు. గత ఏడాది అభివద్ధి సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతీ లబ్ధిదారునికీ చేరువు చేశామన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తు న్నామన్నారు. గ్రీవెన్స్‌ పై అర్జీదారుల అభిప్రాయాలను తెలుసుకుని వారి సంతప్తిని తెలుసుకుంటు న్నానన్నారు. 22ఏ కేసులకు సంబంధించి ప్రతీ శనివారం ప్రత్యేక డ్రైవ్‌ మేళా నిర్వహించి అర్జీదారులు, అధికారుల సమక్షంలో పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే 22 కు పైగా కేసులను పరి ష్కరించామన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా మహిళాభివద్ది, శిశు సంక్షేమంపై ప్రత్యేక దష్టి పెట్టమని దీనిలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులలో రక్తహీనతను నివారించి ఆరోగ్యకర సమాజాన్ని తీర్చిదిద్దు తున్నా మన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌, వ్యర్ధ పదార్దాల సక్రమ నిర్వహణ, రీ సైక్లింగ్‌ వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. ఏ కొండూరు కిడ్నీ వ్యాధులకు సంబంధించి సానుకూల దక్పధంతో ముందుకు వెళుతున్నామన్నారు. వ్యాధి తీవ్రత నిర్దారించే క్రియాటిన్‌ స్థాయి 5 కన్నా ఎక్కువగా 120 మందికి పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వ్యాధికి ప్రధానంగా నీటిలో మెటల్‌ సిలికా, క్లోరైడ్‌ కారణం కావచ్చునని నిపుణులు సూచించారన్నారు. శుద్ధి చేసిన నీటిని టాంకర్‌ ల ద్వారా సరఫరా చేస్తున్నామని ఆనీటిని త్రాగునీటి అవసరాలతో పాటు వంటకు వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించామని కలెక్టర్‌ ఢిల్లీ రావు అన్నారు. ఇష్టాగోష్టి కార్యక్రమంలో కలెక్టర్‌ తో పాటు జిల్లా ఉప కార్యనిర్వహక సమాచార ఇంజినీర్‌ యు. సురేంద్రనాధ్‌, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఎస్‌. వి. మోహన్‌ రావు, సమాచార శాఖ ప్రచార సహాయకులు వేమూరి వర ప్రసాద్‌ లు ఉన్నారు.