Jul 12,2023 20:58

కర పత్రాలు విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తిచేయాలి : సిపిఎం


ప్రజాశక్తి - దేవనకొండ

ఈనెల 26 నుండి సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని దశాబ్దాలుగా పెండింగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అదేవిధంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదోని నుండి కర్నూలు వరకు చేపడుతున్నటువంటి మహా పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు బి.వీర శేఖర్‌ కోరారు. బుధవారం ఆ పార్టీ మండల కమిటీ ప్రజాసంఘాల బాధ్యుల సమావేశం యూసుఫ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరశేఖర్‌ మాట్లాడుతూ ఏళ్ల తరబడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కేవలం ఎన్నికల హామీలుగానే వేదవతి, హంద్రీనీవా, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్‌ కుడికాలువ, గుండ్రేవుల, తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉంటున్నాయని వీటిని పూర్తి చేయడంలో గత 20 సంవత్సరాలుగా పాలకులకు చిత్తశుద్ధి లేదని వీటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సమగ్ర అభివద్ధి కావాలంటే పరిశ్రమలు,విద్యా, వైద్య రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని ఓర్వకల్‌ ఇండిస్టియల్‌ హబ్‌, రైల్వే వ్యగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణాలు వెంటనే చేపట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. రాయలసీమ జిల్లాల లోని తలమానికంగా ఉన్న ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ను ఏయిమ్స్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆ విధమైన పద్ధతిలో మౌలిక సదుపా యాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. విద్య పరంగా రాయలసీమ విశ్వవిద్యాలయం ఉన్న విశ్వవిద్యాలయంలో కు నిధులు లేక కునరిల్లుతుం దని సరైన ఫ్యాకల్టీలు లేరని, మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్‌, మహబూ బ్బాషా, నాయకులు ఓంకార్‌ ,శ్రీనివాసులు, వీరన్న, పాండు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.