Jan 04,2023 00:07

పింఛన్ల చెక్కును అందజేస్తున్న సర్పంచ్‌ లక్ష్మి, కలెక్టర్‌ రవి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో 2.18 లక్షల మందికి పింఛన్ల డబ్బులు పెంచడంతో పాటు 6,718 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం పెంచిన పింఛన్‌ చెక్కులను శంకరం గ్రామ సర్పంచ్‌ పసుపులేటి లక్ష్మి రామకృష్ణతో కలసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,43,141 మంది వృద్ధులు, 60,337 మంది వితంతువులు, 5,780 మంది ఒంటరి మహిళలు, 3,265 మంది మత్స్యకారులు, 2,623 మంది చేనేత పనివారు, 2,328 మంది కల్లు గీత కార్మికులు, 1057 మంది సాంప్రదాయ చర్మకారులకు పింఛన్‌ పెంపు వర్తించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి లక్ష్మీపతి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి మంజుల వాణి, డిఎల్‌డిఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.