Oct 31,2023 22:09

రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి

        అనంతపురం : జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు. మంగళవారం నాడు అనంతపురం నగరంలోని శ్రీనివాసనగర్‌ యుపిహెచ్‌సి వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 392 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను పూర్తి చేశామన్నారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాల నిర్వహణలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యా, వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య, ఆర్డీవో గ్రంధి శ్రీనివాస్‌, డిఎంహెచ్‌ఒ డా||ఈబీ.దేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్‌ రమణారెడ్డి పాల్గొన్నారు.