
ప్రజాశక్తి-యంత్రాంగం
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు ప్రకార జిల్లాలో దిశ మెగా డ్రైవ్ మంగళవారం నిర్వహించారు.
అమలాపురం జిల్లా ఎస్‌పి శ్రీధర్, అదనపు ఎస్‌పి ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు. జిల్లా దిశా డిఎస్‌పి మురళీమోహన్, అమలాపురం డిఎస్‌పి ఎం. అంబికా ప్రసాద్, రామచంద్రపురం డిఎస్‌పి.టిఎస్‌ఆర్ కె.ప్రసాద్ లు జిల్లా పోలీసు సిబ్బంది తో మహిళా పోలీసులతో దిశా యాప్ రిజిస్ట్రేషన్స్ చేయించారు. ఈ ఒక్కరోజే 22,000 పైగా దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు దిశా డిఎస్‌పి మురళీమోహన్ తెలిపారు. ఆలమూరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశయాప్ మహిళల రక్షణకు ఉపయోగపడుతుందని ఎస్‌ఐ శ్రీను నాయక్ అన్నారు. పలు ప్రధాన ముఖ్య కూడళ్ల వద్ద గ్రామ, వార్డు మహిళా పోలీసులతో కలిసి ఆయన ఆధ్వర్యంలో మహి ళలు, యువతకు దిశా యాప్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.మామిడికుదురు దిశ యాప్ మీ చెంత ఉంటే మీకు రక్షణగా పోలీసు ఉన్నట్లేనని మామిడికుదురు ఎస్‌ఐ పివివిఎస్.వి సురేష్ తెలిపారు. కొత్తపేట డిఎస్‌పి, పి.గన్నవరం సిఐల ఆధ్వర్యంలో నగరం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి ఎస్‌ఐలు హరికోటి శాస్త్రి, ఎ.చైతన్య కుమార్, కె.సురేష్ బాబు పర్యవేక్షణలో ప్రధాన సెంటర్లలో మెగా డ్రైవ్ నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లోని ప్రధాన సెంటర్ లు, కాలేజీలు, పాఠశాలలు వద్ద పోలీస్ కానిస్టేబుల్, సచివాలయ మహిళా పోలీసులు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసి వాటిపై అవగాహన కల్పించారు.