Aug 17,2023 21:15

సంతృప్తి వ్యక్తం చేసిన సఫాయి కర్మచారీస్‌ జాతీయ కమిషన్‌ సభ్యులు వావా
కలెక్టర్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబు
ప్రజాశక్తి - ఏలూరు

             ఏలూరు విచ్చేసిన సఫాయి కర్మ చారీస్‌ జాతీయ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ పిపి.వావాను జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి డాక్టర్‌ పిపి.వావా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిపి.వావా మాట్లాడుతూ రాష్ట్రంలో సఫాయి కర్మచారీస్‌కు సంబంధించి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యువ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసు కువెళ్లడం తన పర్యటనలో చూశానని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సమర్థవంతంగా పని చేస్తున్నారని పిపి.వావా కితాబు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ అర్హులైన పేదలకు ఇళ్లు అందిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు కమిషన్‌ సామాజిక సలహాదారు గిరీంధ్రనాధ్‌ ఉన్నారు.