Dec 21,2022 23:52

సమావేశం నిర్వహిసుత్న జెసి

ప్రజాశక్తి-కోటవురట్ల:మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ కల్పనకుమారి సిబ్బందితో రీ సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా సర్వే తీరు పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, నిర్ణీత సమయంలో పూర్తి కాకపోతే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 143 గ్రామాల్లో రీ సర్వే పూర్తివచ్చిందని, ప్రస్తుతం 161 గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. ఇంతవరకు లక్షా 30వేల ఎకరాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు, మ్యూటేషన్‌, సరిహద్దులు, కోర్టు కేసుల సమస్యలు ఉన్నాయన్నారు. నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జానకమ్మ, డిప్యూటీ తహశీల్దారు సోమశేఖర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సిడిపిఓ, హెల్త్‌ సిబ్బందితో రక్తహీనత పై తీసుకోవలసిన చర్యలపై వివరించారు. చిన్నారుల్లో రక్తహీనత సమస్య ఉందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులకు, గర్భిణీలకు అవగాహన కల్పిస్తూ సకాలంలో మందులు అందజేయాలన్నారు.ఈ ఎంపీడీవో చంద్రశేఖర్‌, సిడిపిఓ సుజాత, వైద్య, అంగన్వాడీ సిబ్బంది, కేజీబీవీ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.