ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం, వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన మున్సిపల్ జాతా శుక్రవారం రాత్రి జిల్లాలో అడుగుపెట్టింది. తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్ కార్మికులు జాతాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలపై అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి మున్సిపల్ వర్కర్ కి రూ.18 వేలు వేతనం ఇస్తానని చెప్పి నేడు హెల్త్ అలవెన్స్‌గా మార్పు చేసి నెలల తరబడి బకాయి పెడుతున్నారని విమ ర్శించారు. ఇంజి నీరింగ్, వాటర్ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్క రించాలని కోరారు. కాంట్రా క్టు ఉద్యోగులు తుని మున్సిపాలిటీలో ఇప్పటికీ ముగ్గురు కార్మి కులు చనిపోయినా ఏ ఒక్కరి కుటుంబానికి కూడా ఒక్క రూపాయి పరిహారం అందలేదని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిహారం చెల్లించకుండా రాష్ట్ర అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తప్పించుకుంటు న్నారన్నారు. తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబానికి పరిహారం ఇవ్వాలని,వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తుని మండల అధ్యక్షురాలు ధనలక్ష్మి , మండల ప్రధాన కార్యదర్శి నక్కెళ్ల శ్రీను, సిఐటియు నాయకులు షేక్ పద్మ , అంగన్వాడీ, ఆశా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాత ఏలేశ్వరం నగర పంచాయతీకి చేరుకుంది.










