Sep 30,2023 23:52

జిల్లా వర్క్‌షాష్‌లో హైకోర్టు న్యాయమూర్తి

జిల్లా వర్క్‌షాష్‌లో హైకోర్టు న్యాయమూర్తి
న్యాయవాదుల వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న జస్టిస్‌ రవినాథ్‌తిల్హారి

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి ఒకరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు పట్టణం ఆర్‌అండ్‌బి అతిథి గహం చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ సగిలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమారావ్‌, జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ. కరుణకుమార్‌, జడ్పీ సీఈఓ ఎం.ప్రభాకర్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ మీటింగ్‌ హాల్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమరావ్‌, దిన్‌ స్కూల్‌ ఆఫ్‌లా, సత్యభామ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డీమ్డ్‌ యూనివర్సిటీ చెన్నైకి చెందిన డాక్టర్‌ దిల్‌ షాద్‌ షేక్‌, అనంత లా కళాశాల తిరుపతికి చెందిన ప్రొఫెసర్‌ నాగార్జున రెడ్డిలతో కలసి జిల్లాస్థాయి జ్యూడిషియల్‌ ఆఫీసర్స్‌కు ఒకరోజు నిర్వహించిన వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో వివిధ అంశాలకు సంబంధించి చర్చ నిర్వహించగా పలువురు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సీనియర్‌ మరియు జూనియర్‌ జిల్లా జడ్జీలు తదితరులు పాల్గొన్నారు.
వరసిద్ధుని సేవలో..
ఐరాల: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి శనివారం కుటుంబ సమేతంగా శ్రీకాణిపాక వరిసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఏఈఓ కష్ణారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట చిత్తూరు ఆర్డీవో రేణుక, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఐరాల సిఐ రవిశంకర్‌ రెడ్డి, కాణిపాకం ఎస్సై ఉన్నారు.
హైకోర్టు జడ్జిని కలసిన ఎస్పీ, కలెక్టర్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ రవినాథతిల్హారి జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో మర్యాదపుర్వకంగా కలిసిన పుష్పగుచ్చాని అందించారు.
్ర