Sep 12,2023 21:12

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
జిల్లా విద్యుత్‌ శాఖ
సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా వి.విజయన్‌
ప్రజాశక్తి-నెల్లూరు:చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌,ఆపరేషన్‌ గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై జిల్లా సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా ఇవ్వడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుచేయడం, విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా నివారించడం అంశాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారం తో సంస్థ అభివృద్దికి కృషి చేస్తామన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఈ విజయన్‌ను జిల్లాలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌,అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ ,జిల్లాలోని అన్ని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు,అసోసియేషన్‌ నాయకులు మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.