Sep 17,2023 22:14

ప్రజాశక్తి - ఆచంట
           ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని హోలీ ఏంజెల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ కరస్పాండెంట్‌ కె.రవికుమార్‌ అన్నారు. కొడమంచిలి హోలీ ఏంజెల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రేణుకకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల ఆ స్కూల్‌ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేణుకకు డిఇఒ సివి.రేణుక ప్రశంసాపత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ జాతి ఔనత్యాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో హోలీ ఏంజెల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు మండల వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారంటే అందులో ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా రేణుకకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచి సుంకర సీతారామ్‌ ఆమెకు అభినందనలు తెలిపారు.