Dec 15,2022 00:18

ఎంపికైన ప్రాజెక్టు చూపుతున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు తయారు చేసిన రెండు నమానాలు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. కశింకోట బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి సైన్స్‌ నమోనాల ప్రదర్శన నిర్వహించగా, 12 పాఠశాలల నుంచి సుమారు 60 నమూనాలను ప్రదర్శించారు. వీటిల్లో ఐదు ప్రాజెక్టులను జిల్లా ప్రదర్శనకు ఎంపిక చేయగా, అందులో తాళ్లపాలెం అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాల నుంచి రెండు నమూనాలు ఎంపికైనట్లు కసింకోట ఎంఈఓ చిట్టిబాబు ప్రకటించారు. ఆ ప్రాజెక్టులకు తర్ఫీదు ఇచ్చిన సైన్స్‌ ఉపాధ్యాయులు టి.నవనీత వాణి, ఎం.నిర్మల, ఎం.మాధురి, డి.కనకమ్మ, ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్‌ మళ్ళ మాణిక్యం బుధవారం అభినందించారు. ఈ నమూనాలను ఇంకా మెరుగైన రీతిలో తయారు చేసి జిల్లా స్థాయిలో ఎంపికయ్యేటట్లు కృషి చేయాలని సూచించారు.