Mar 04,2023 00:11

పోటీలను ప్రారంభిస్తున్న లక్ష్మణ్‌; దుర్గాప్రసాద్‌

ప్రజాశక్తి-సబ్బవరం
గ్రామీణ యువకులు క్రీడల్లో రాణించాలని అభయాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్‌ వడిశల లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ గోలజాన దుర్గాప్రసాద్‌ అన్నారు. మండలంలోని గొట్టివాడ గ్రామంలో అభయాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను వడిశల లక్ష్మణ్‌, గోళాజాన దుర్గాప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడలు దేహ దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొంది స్తాయన్నారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి 18 జట్టులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.12 వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంటి, హరికృష్ణ, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.