Sep 17,2023 00:56

ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
నియోజవర్గ స్థాయిలో శుక్రవారం కాకానిపాలెంలో జరిగిన ఆటల పోటీల్లో గుంటుపల్లి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనపర్చారు. గుంటుపల్లి కేజీబీవీ విద్యార్థినిలు జి రాజేశ్వరి 1500మీటర్స్ రన్నింగ్ రేస్ లో మొదటి స్థానంలో నిలిచింది. డి కోమలి 600మీటర్స్ పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచింది. యోగాలో మొదటి స్థానంలో కె హేమలత, రెండవ స్థానంలో కె చంద్రిక నిలిచారు. డిస్క్ త్రోలో భూమిక రెండో స్థానంలో నిలిచింది. కబాడీ పోటీలలో ఏ లక్ష్మీ ప్రసన్న, జి రాజేశ్వరి, జె దీక్షిత ఉత్తమ ప్రతిభ చూపారు. వీరందరూ జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపిక అయినట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె సరళ కుమారి తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధులను అభినందించారు.