జిల్లా స్థాయి కోకో పోటీలకు బైరెడ్డిపల్లి విద్యార్థులు
ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి: మండల కేంద్రంలోని అగస్తి పాఠశాలలో నియోజకవర్గస్థాయి గేమ్స్ కోకో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో ఐదు మండలాలకు చెందిన కోకో క్రీడాకారులు 500 మంది పాల్గొన్నారు. ఈ పోటీలలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఇందులో 14 సంవత్సరాల పురుషుల విభాగంలో మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాము గాని పల్లి ,రెండవ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముదరం దొడ్డి, 14 సంవత్సరాల మహిళల విభాగంలో మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాము గాని పల్లి, రెండవ బహుమతి ఏపీ ఆర్ ఎస్ కమ్మనపల్లి పాఠశాల వారు, 17 సంవత్సరాల పురుషుల విభాగంలో మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాము గాని పల్లి, రెండవ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తికొండ, 17 సంవత్సరాల మహిళల విభాగంలో మొదటి బహుమతి ఏపీ ఆర్ ఎస్ కమ్మనపల్లి పాఠశాల వారు, రెండవ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోల మాసనపల్లి వీరు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. వీరికి బైరెడ్డిపల్లి ఎంపీపీ మొగసాల రెడ్డప్ప బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి సాయి లీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదు మండలాల పీఈటీలు పాల్గొన్నారు. స్థానిక పీటీ రషీద్ అజిత్ ఆధ్వర్యంలో క్రీడలు విజయవంతంగా ముగిశాయి. కుప్పం ఎమ్మెల్సీ భరత్. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్. కుప్పం నియోజకవర్గ పరిశీలకులు ఎంపీపీ మగసాల రెడ్డప్ప, కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.










