Sep 17,2023 00:38

తరలి వచ్చిన హాకి క్రీడాకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలోవిశాఖపట్నం ఉమ్మడి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నక్కపల్లి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం లో అంతర్‌ పాఠశాల హాకీ పోటీల జిల్లా జట్లు ఎంపిక పోటీలను ప్రారంభించారు. నక్కపల్లి ,యలమంచిలి, విశాఖపట్నం, పెందుర్తి, ధర్మవరం, సింహాచలం నుండి క్రీడాకారులు పాల్గొన్నారు . అండర్‌ 14 బార్సు 4టీమ్‌లు, అండర్‌ 14 గర్ల్స్‌ 4టీమ్‌ లు, అండర్‌ 17 బార్సు 5టీమ్‌ లు పాల్గొన్నాయి. విన్నర్స్‌ గా అండర్‌ 14 బార్సు నక్కపల్లి, రన్నర్స్‌ గా యలమంచిలి, అండర్‌ 14 గర్ల్స్‌ విన్నర్స్‌ గా నక్కపల్లి, రన్నర్స్‌ గా ధర్మవరం,అండర్‌ 17 బార్సు విన్నర్స్‌ గా విశాఖపట్నం, రన్నర్స్‌ గా యలమంచిలి, అండర్‌ 17 గర్ల్స్‌ ప్రాబుల్స్‌ గా నిలిచాయి .ప్రధమ, ద్వితీయ స్థానాలకు ఎంపిక చేశారు. క్రీడాకారులందరూ మంచి ప్రతిభ కనబరచడంతో విశాఖ ఉమ్మడి జిల్లా టీమ్‌కు ఎంపిక చేయడం జరిగింది. డిఈఓ వెంకట లక్ష్మి, ఎంపిపి రత్నం, సర్పంచ్‌ జయరత్న కుమారి చేతులు మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన బాల బాలికల టీమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటారని విశాఖపట్నం , అనకాపల్లి జిల్లా స్కూల్‌ గేమ్‌ కార్యదర్శి టి. నాగేశ్వరావు, ఎం.వి నాగేశ్వరావు, హైస్కూల్‌ హెచ్‌ఎం రాణి లలిత తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరేష్‌ , పీడీ లు, బియస్‌ హాకీ ఫౌండర్‌ బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి తాతాజీ, మాజీ సర్పంచ్‌ కల్పన, కోచ్‌ రాంబాబు, రామచంద్రరావు, నానాజీ ,రంజిత్‌ ,ప్రసాద్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు .