Jul 20,2023 20:47

జీపు జాతాలో మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 26 నుంచి 31 వరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. గురువారం మండలంలోని మదిరే, చిన్నహరివాణం, చిన్నగోనెహళ్‌, సంతేకుడ్లూరు, బలాదూరు, ఎడవల్లి, పెద్దహరివాణం, హనవాళ్‌, జి.హోసల్లి, కడితోట, ఇస్వి, బసాపురం, చాగీ, నారాయణపురం, ఢణాపురం గ్రామాల్లో జీపుజాతా సాగింది. సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న, మండల కార్యదర్శి వర్గసభ్యులు బి.వీరారెడ్డి, మండల నాయకులు శేఖర్‌, శాఖా కార్యదర్శులు రామాంజనేయులు, శ్రీనివాసులు, లక్ష్మన్న, పార్టీ సభ్యులు రహిమాన్‌, హుస్సేని, ఉరుకుందు, హనుమంతు రెడ్డి పాల్గొన్నారు. పెద్దకడబూరు బస్టాండ్‌లో సిపిఎం ఆధ్వర్యంలో జీపుజాతా నిర్వహించారు. మండలంలోని కంబాలదిన్నె, జాలవాడి, హెచ్‌.మురవాణి, దొడ్డిమేకల, రాఘమాన్‌ దొడ్డి, కంబదహాల్‌ గ్రామాల్లో జీపుజాతా సాగింది. సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, కార్యదర్శి వర్గసభ్యులు కె.పరమేష్‌, వ్యకాస నాయకులు చిన్నతుంబలం హనుమంతు, ఉప్పర శ్రీనివాసులు, సిఐటియు నాయకులు ఉప్పర ఈరన్న, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నాగిరెడ్డి, దేవదాసు, చిన్న తుంబలం రాజు మాట్లాడారు. ఈనెల 26 నుంచి 31 వరకు చేపేట్ట మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.