Jul 22,2023 21:25

సమావేశంలో మాట్లాడుతున్న గోవర్థన్‌రెడ్డి

 రాయచోటి : జిల్లా సమగ్ర అభివద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచే యాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాలు లో కలెక్టర్‌ గిరీష ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమా వేశం నిర్వహించారు. సమావేశంలో మొదట గత సమావేశంలో వివిధ అంశాల్లో పేర్కొన్న సమస్యలపై శాఖాపరంగా తీసుకొన్న చర్యలు, గహ నిర్మాణం, నాడు-నేడు, ఐసిడిఎస్‌, వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ, ఎడ్యుకేషన్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివద్ధిలో భాగంగా జగనన్న స్వచ్ఛసంకల్పం, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌, ఆర్డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, విద్యుత్తు, జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకం, గ్రామ వార్డు సచివాలయాలు, సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివద్ధి, సంక్షేమం, ప్రజలకు పారదర్శక పాలనను అందిం చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందిన్నారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అందు కుని జిల్లాను అన్ని విధాలా అభివద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కషి చేద్దాంన్నారు. రాష్ట్రా భివద్ధికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్ర మాలను జిల్లా స్థాయిలో సక్రమంగా, విజయవంతంగా అమలు చేయడం అధికారుల బాధ్యత. ప్రభుత్వంలో భాగస్వాములైన కలెక్టర్‌ నుంచి అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్ర తినిధులు అందరూ జిల్లా అభివద్ధిలో భాగస్వాములైఅర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కషి చేయలిన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇరువురూ సమన్వయంతో ప్రతి గడపకు పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించా లన్నారు. సంపూర్ణంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించి జిల్లా అభివద్ధికి పాటుపడాలన్నారు. నూతన జిల్లా అయినందున మరింత అభివద్ధి చెందేందుకు అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పని చేయాలన్నారు. పథకాల అమలు విష యంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు ప్రజలు వచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉన్న ఓపికగా సమాధానం చెప్పడం నేర్చుకోవాలన్నారు. సమావేశంలో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కడప, చిత్తూర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, జి.శ్రీనివాసులు, ఎమ్మె ల్యేలు పి.ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేడా మల్లి కార్జునరెడ్డి, జెసి పర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్డీవోలో రంగస్వామి, మురళి, భాస్కర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.