Oct 27,2023 23:17

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందని, మొత్తం ఓటర్లు 15,45,666 ఉన్నారని, ఇందులో 7,63,671 మంది పురుషులు, 7,81,887 మంది స్త్రీ లు, 108 మంది ట్రాన్స్‌ జెండర్‌ లు కలరని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలసి జిల్లా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందని, జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌లు, తహశీల్దార్‌, ఆర్డిఓ కార్యాలయాల వద్ద ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాలలో ఫారం 6, 7, 8 ప్రింటింగ్‌ ఫారాలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. నవంబర్‌ 4, 5, డిసెంబర్‌ 2, 3 తేదీలలో ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరాల్లో బల్క్‌గా ఫారాలు ఇవ్వడం, స్వీకరించడం జరగదని తెలిపారు. ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలో ఏవైనా పొరపాట్లు, తప్పిదాలు ముద్రించబడినా, జాబితాలో ఉన్నవారు ఏవైనా మరణించినా, శాశ్వతంగా వలస వెళ్ళినా, అనర్హులైన ఓటర్ల వివరాలను సంబంధిత బూత్‌ లెవెల్‌ ఆఫీసర్ల దష్టికి తీసుకువచ్చి తప్పిదాలు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయుటలో ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి కోరారు. 2023 డిసెంబర్‌ 26న క్లైములు, ఆక్షేపణలపై విచారణ పూర్తి చేయడం, 2024 జనవరి 1న డేటాబేస్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేసి, 2024 జనవరి 5న తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎలెక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ బ్యూలా, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి పరదేశి, భాస్కర్‌లు, బిజేపి ఆలూరి శ్రీనివాస్‌, టిడిపి ఎస్‌.సురేంద్ర కుమార్‌, రాజ నరసింహులు, వైసిపి ఉదరు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ..
'జగనన్నకు చెబుదాం' : జెసి
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఇన్చార్జ్‌ తహశీల్దార్‌ అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలోని స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందని అన్నారు. ప్రజలు వారివారి సమస్యలను ఆర్జీల రూపంలో అందజేస్తే పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో భూసమస్య, నిరుపేదలకు ఇంటి స్థలాలపై అర్జీలు అందుతున్నాయని త్వరలోనే అర్హులందరికీ ఇంటి స్థలాలు అందేలా, భూసమస్యలు రీ సర్వేలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీవో మనోజ్‌ రెడ్డి, రాష్ట్ర పాలఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుమార్‌ రాజా, ఎంపీపీ అమరావతి, జడ్పిటిసి సోమశేఖర్‌, సింగల్‌ విండో చైర్మన్‌ దత్తురెడ్డి, ఇన్చార్జ్‌ ఎంపీడీవో హరి ప్రసాద్‌ రెడ్డి, సర్పంచులు ఉమాదేవి, వాణి, ప్రియ పాల్గొన్నారు
ముస్లిం సమస్యలను పరిష్కరించండి : జిల్లా వక్స్‌ బోర్డ్‌ కార్యదర్శి ఫిరోజ్‌ అహ్మద్‌
ముస్లిం సమస్యలను పరిష్కరించాలని జిల్లా వక్స్బోర్డు కార్యదర్శి ఫిరోజ్‌ అహ్మద్‌ జెసిని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన జగనన్నకు చెబుదాం సమావేశంలో జెసి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ముస్లింలకు కేటాయించిన షాదీ మహల్‌ స్థలానికి దారి లేకుండా చేశారని, జామ్యా మజీద్‌కు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెండో రోజూ ఓపెన్‌ హౌస్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతిఏటా అమరవీరులైన పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని 2వ రోజు నిర్వహించారు. జిల్లా ఏఆర్‌ పోలీసు కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి, పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధరకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి కళాశాల, పాఠశాల విద్యార్థులు తెలుసుకున్నారు. వచ్చిన విద్యార్థులకు ఆయుధాల గురించి ఎఆర్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పనితీరు గురించి అవగాహన కల్పించారు. పట్టణంలోని స్కూల్స్‌, కాలేజీ విద్యార్ధులు సుమారు 1000 మంది పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఉంచిన విభాగాలు..
డాగ్‌ స్క్వాడ్‌, ఆయుధాల ప్రదర్శన, బాంబు డిటెక్షన్‌ స్క్వాడ్‌ విభాగం, కమ్యూనికేషన్‌ విభాగం, ఫింగర్‌ ప్రింట్స్‌, క్లూస్‌ టీం, ట్రాఫిక్‌ విభాగం, దిశా యాప్‌పై అవగానన, పోలీస్‌ ఆఫీసర్స్‌ కేడర్స్‌, ఎర్రచందనం, ఎస్‌ఈబీ సైబర్‌ క్రైమ్‌ ప్రత్యేకస్టాల్‌ను ప్రదర్శన చేసి సైబర్‌నేరాల పట్ల యువతలో అవగాహన కల్పించారు. పోలీస్‌ వాహనాల ప్రదర్శన, ఫ్రీగో వెహికల్స్‌, దిశా మొబైల్‌ రెస్ట్‌ రూమ్స్‌ వాహనము తదితర వాహనాలను ప్రదర్శనలో ఉంచారు.
మాన్యూవల్‌లో టీచర్ల చందా వివరాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఆన్‌లైన్‌లో టీచర్ల చందా వివరాలు కనిపించకపోవడంతో జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి మాన్యూవల్‌గా స్వీకరించేందుకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నుండీ ఉపాధ్యాయుల చందా వివరాలు స్వీకరించేందుకు ప్రత్యేకఏర్పాట్లు చేశారు. రిజిస్టేషన్‌, అకౌంట్స్‌ పోస్టింగ్‌ వివరాలను స్వీకరించారు. ఆన్‌లైన్‌లో కనిపించని ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించిన నమోదు చేయించుకోవాలని ఇందు కోసం ఎంఈఒలు డేటా పంపాలని కోరారు. లోన్లు అప్లై చేసుకున్న ఉద్యోగులు, టీచర్లు దరఖాస్తులను, నిబంధనల ననుసరించి, దరఖాస్తులను పరిశీలించి, లోనులు మంజూరు చేయుటకు త్వరితగతిన కషి చేయాలని సిబ్బందిని జెడ్పి సీఈవో ఆదేశించారు. జడ్పీ ఆఫీస్‌ అకౌంట్స్‌ విభాగపు అధికారి బాలాజీ, ఎస్టాబ్లిష్మెంట్‌ రమణ ప్రకాష్‌, నాగమణి, సిబ్బంది పాల్గొన్నారు.