May 06,2023 01:05
బాపట్ల ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా

ప్రజాశక్తి-బాపట్ల: మండలాల్లో జిల్లా పరిషత్‌ స్థలాలను పరిరక్షించాలని గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కత్తెర హెన్రో క్రిస్టినా అన్నారు. శుక్రవారం బాపట్ల మండల పరిషత్‌ కార్యాలయా న్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండల పరిధిలో జడ్పీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా, ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. తనిఖీల్లో చైర్‌ పర్సన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు కుర్రా రమాదేవి రాంబాబు, ఎంపీడీఓ రాధాకృష్ణ, ఈఓఆర్డి శరత్‌ బాబు, ఏఇ మోహన్‌ రావు, ఎంఈఓ నిరంజన్‌, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.