Jun 30,2023 21:20

జడ్జి దంపతులను సన్మానిస్తున్న బార్‌ అసోసియేషన్‌ నాయకులు

 కడప : జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా రెండు నెలల కాలం పాటు పనిచేసిన వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి శుక్రవారం పదవి విరమణ చేశారు. ఈ సం దర్భంగా సాయ ంత్రం కడప బార్‌ అసో సియేషన్‌( న్యాయ వాదుల సంఘం) అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు పిఎస్‌. బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి వై.టి.జె. కెనడి, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆధ్వర్యంలో వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి దంపతులకు వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విరమణ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ తాను గతంలో పలుచోట్ల జడ్జిగా పనిచేశానని, కడపలో రెండు నెలల బాధ్యతలు ఎంతో సంతప్తిని ఇచ్చా యని అన్నారు. రెండు నెలల కాలంలో 75 కేసులు న్యాయవాదుల సహకారంతో పరిష్కరించగలిగానని తెలిపారు. తనకు న్యాయవాదులు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.వి.రాఘవరెడ్డి మాట్లాడుతూ రెండు నెలల కాలం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి అందరి హదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేసిన న్యాయవ్యవస్థకు దూరం కారని తాము భావిస్తున్నామన్నారు. అనంతరం కడప బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొని ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. అన్నపూర్ణ, ఆరవ అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్‌ అహ్మద్‌, నాల్గవ అదనపు జిల్లా జడ్జి గీత, అడిషనల్‌ సబ్‌ జడ్జి ఎం. ప్రదీప్‌ కుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎస్‌. కవిత, జిల్లా న్యాయమూర్తులు ప్రసూన, స్రవంతి, నందిని, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.