ప్రజాశక్తి-గుంటూరు లీగల్:రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా న్యాయవ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, సుప్రీం కోర్టు వరకూ వివిధ హోదాలలో జిల్లాకు చెందిన వారు ఉండటం ప్రశంసనీయమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థసారధి పేర్కొన్నారు. గుంటూరు కోర్టుల నుండి బదిలీపై వెళుతున్న పలువురు న్యాయమూర్తులను గుంటూరు బార్ అసోసియేషన్ మంగళవారం ఘనంగా సత్కరించింది. బార్ అధ్యక్షులు కెవికె సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి మాట్లాడుతూ జిల్లా నుండి విభిన్నమైన కేసులు వస్తుంటాయని, తద్వారా న్యాయవాదులు, న్యాయవ ుూర్తులు కొత్తపాఠాలు నేర్చుకుంటారన్నారు. బదిలీపై వెళుతున్న 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ కె.రత్నకుమార్, సబ్‌కోర్టు జడ్జిలు డి.విజయసారధిరాజు, ఎం.వెంకట శేషమ్మ, ఎ.సునీతరాణి మాట్లాడారు. అనంతరం వారిని దుశ్శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.వంశీకృష్ణ, షేక్.నైనా, జి.విజయ రాజకుమార్, మహిళా కార్యదర్శి ఎం.స్వాతి, కార్యవర్గ సభ్యులు, యం.ఆదిలక్ష్మి, జి.అనురాధ, పి.రాజేష్, ఆర్.శ్రీనివాసరావు, జి.శ్రీలక్ష్మి, పి. నంద, పి.శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు చెరుకూరి సత్యనారాయణ, వై.కోటేశ్వరరావు, జి.శాంతకుమార్, ఎ. ప్రసాద్ పాల్గొన్నారు.
జడ్జి రత్నకుమార్‌కు ఘన వీడ్కోలు
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జిగా పని చేసిన కె.రత్నకుమార్ విశాఖపట్నం 6వ అదనపు సివిల్ జడ్జిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ భవన్‌లో మంగళవారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, డిఫెన్స్ కౌన్సిలర్లు తనకు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. వారి సహకారం వల్లే సామాన్యుల కోసం ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం కలిగిందని చెప్పారు. కార్యాక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ సుబ్బారావు, సిబ్బంది, ప్యానల్ న్యాయవాది కట్టా కాళిదాసు, డిఫెన్స్ కౌన్సిలర్లు జీవరత్నం, ఇల్లా మధుబాబు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు










