Sep 30,2020 23:07

నలుగురికి... కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు


ప్రజాశక్తి-కర్నూలు క్రైం/ఆదోని రూరల్‌
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కార్పొ రేషన్‌ ఛైరన్ల పదవుల్లో జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. వాల్మీకి/బోయ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆదోని పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, కుర్ని/కరికాల భక్తుల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మిగనూరుకు చెందిన బుట్టా రంగయ్య భార్య బుట్టా శారదమ్మ, వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎమ్మిగనూరుకు చెందిన వై.రుద్రగౌడ్‌, బెస్త కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా కర్నూలు అశోక్‌ నగర్‌కు చెందిన టివి రమణ కుమార్తె తెలుగు సుధారాణిని నియమించారు. తమపై ఎంతో నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ పదవి ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డికి ధన్య వాదాలు తెలుపు తూ తాను చేపట్టే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ద్వారా వాల్మీకులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని డాక్టర్‌ ఎ.మధు సూదన్‌ ప్రజాశక్తికి చెప్పారు.