Jun 25,2023 20:50

జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపికలకు విశేష స్పందన

కడప : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కడపలోని వై.ఎస్‌. రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో ఉన్న క్రికెట్‌ నెట్స్‌లో నిర్వహించిన అండర్‌ -14, అండర్‌ -16 విభాగాలకు చెందిన జిల్లా స్థాయి క్రికెట్‌ చెట్ల ఎంపికలకు విశేష స్పందన లభించింది. ఈ రెండు విభాగాలకు సంబంధించి 230 మంది క్రీడాకారులు ఎంపికలకు హాజరయ్యారు. అండర్‌-14 కు 130 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో మంచి ప్రతిభ కనబరిచిన 65 మందిని ఎంపిక చేసినట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. అండర్‌-16కు 100 మందిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 45 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికలకు హాజరైన వారికి బౌలింగ్‌, బ్యాటింగ్‌, కీపింగ్‌లలో సెలక్షన్‌ కమిటీ సభ్యులు ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికలను జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి మునగ సాయి పథ్వి తేజ, పురుషుల క్రీడాకారుల రిప్రజెంటేటివ్‌ షేక్‌ మహమ్మద్‌ దౌలా, అసోసియేషన్‌ సభ్యులు ముని కుమార్‌ రెడ్డి, శివప్రసాద్‌, సుబ్రహ్మణ్యం, విష్ణు మోహన్‌ రావు, ఆనంద్‌ పర్యవేక్షించారు.ఎంపికలకు హాజరైన క్రీడాకారులు