Jun 21,2023 22:01

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : జిల్లా కోర్టు ఆవరణలో యోగా దినోత్సవం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి పార్థసారధి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు రాజగోపాలరావు, జి.అర్చన, సీతారామకృష్ణారావు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రమౌళీశ్వరి, ఇతర న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కెవికె.సురేష్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు వి.బ్రహ్మారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.