Nov 17,2023 19:44

జిల్లా జడ్జికి వినతి పత్రం ఇస్తున్న బార్‌ అసోసియేషన్‌ నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో ఉన్న జిల్లా అదనపు కోర్టులో పూర్తిస్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టి సేవలు సకాలంలో అందేలా చూడాలని ఆదోని బార్‌ అసోసియేషన్‌ నాయకులు అనిత బాయి కోరారు. శుక్రవారం జిల్లా జడ్జి శ్రీనివాస రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కోర్టులో ఉద్యోగుల నియామకం పూర్తిస్థాయిలో లేకపోవడంతో కేసులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ చూపాలని కోరారు. వారానికి రెండుసార్లు సబ్‌ జడ్జి ఆదోనిలో పని చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. జిల్లా జడ్జి శ్రీనివాస రావు సానుకూలంగా స్పందించారని తెలిపారు. న్యాయవాదులు ఆదోని బార్‌ అసోసియేషన్‌ నాయకులు సవితా రాణి, లావణ్య ఉన్నారు.