Dec 03,2022 23:34

రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవిపటాన్‌శెట్టి

ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలో జిల్లా కలెక్టర్‌ రవిపట్టాన్‌శెట్టి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృధ్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చీడిగుమ్మల గ్రామంలో నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసిన హైస్కూల్‌ భవనాలను పరిశీలించారు. గ్రామంలో వివాదాస్పదంలో ఉన్న ఆర్‌బికే కేంద్ర నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణం నిలిచి పోవడానికి కారణాలపే జడ్పిటిసి సుర్ల గిరిబాబుతో చర్చించారు. అనంతరం చీడిగుమ్మల సచివాలయాన్ని ఆయన సందర్శించారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న జగనన్న లేఅవుట్‌ను సందర్శించారు. ఇళ్ల నిర్మాణం చేస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక కొరత ఏర్పడిందని లబ్ధిదారులు చెప్పడంతో అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం గుండుపాల సచివాలయాన్ని సందర్శిం చారు. గ్రామంలో నిర్మిస్తున్న ప్రభుత్వ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో జయరాం, ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ ఆనంద్‌, ఈఒపిఆర్‌డి రఘు, స్థానిక సర్పంచ్‌ చిన్నారావు, ఎంపిటిసి లెక్కల అప్పలనాయుడు, పిఆర్‌ డిఎ ప్రసాదరావు, జెడ్పీటీసీ గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైసిపి మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.