
ప్రజాశక్తి - బాపట్ల
రాష్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రం అందజేశారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అందుకనుగుణంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. హరిజన, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, బ్యాంకులు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించలేక ఎంతోమంది నైపుణ్యం గల అభ్యర్థులు వెళ్లలేక నష్టపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బహుజన, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు బోయిన సూరిబాబు, కోమ్మనబోయిన ఫణింద్ర, గండికోట వెంకటరావు, నాగూర్, పీలా సాంబశివరావు పాల్గొన్నారు.