దరఖాస్తులు ఆహ్వానం
ప్రజాశక్తి - విజయవాడ : జిల్లా కారాగారంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా కారాగారంలో ఖాళీగా ఉన్న మేల్ నర్సింగ్ ఆర్డేర్లీ డ్రైవర్ ఎలక్ట్రీషియన్ స్వీపర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు అయన తెలిపారు. మేల్ నర్సింగ్, స్వీపర్ పోస్టులకు నెలకు రూ.12 వేలు, డ్రైవర్, ఎలక్ట్రీషియన్ పోస్టులకు నెలకు రూ.15 వేలు నెలసరి వేతనంగా చెల్లించ న్నుట్లు తెలిపారు. సదరు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ దరఖాస్తు ఫారం, జత చేయవలసిన ధ్రువపత్రాల ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం పూర్తిచేసిన దరఖాస్తులను హంసా పాల్ జిల్లా కారాగారం పర్యవేక్షణాధికారి విజయవాడ వారి కార్యాలయంలో 25వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలన్నారు. గడువు తేదీ ముగిసిన అనంతరం ఎటువంటి దరఖాస్తులు స్వీకరించ బడవని తెలిపారు. ఆసక్తి కలిగి అర్హత ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు.










