Apr 10,2023 20:18

భోజ‌నాన్ని ప‌రిశీలిస్తున్న న్యాయ‌మూర్తి కె.ర‌త్న‌కుమార్‌

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : నగరంలోని జిల్లా జైలను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నకుమార్‌ సోమవారం సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి ఆరోగ్యం, ఆహారం సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఖైదీలకు అందించే భోజనాన్ని పరిశీలించడంతోపాటు పారిశుధ్య నిర్వహణపైనా ఆరా తీశారు. ఖైదీలకుగల హక్కులను వివరించడంతోపాటు సత్‌ప్రవర్తనతో మెలగాలని సూచించారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమతలేనివారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీపడదగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జైలు సిబ్బంది పాల్గొన్నారు.