ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన వైసిపి నాయకులు
ప్రజాశక్తి-బొమ్మనహాల్ మండల పరిధిలోని బత్తలపల్లి టోల్‌గేట్ వద్ద గురువారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని ముల్లంగి నారాయణస్వామితో పాటు పలువురు వైసిపి నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రితో మాట్లాడుతూ రాయదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సరైన వ్యక్తి నిలబెట్టాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మెచ్చిన అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థిని వైసిపి తరఫున నిలబెట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో లాలుసాబ్, గోవిందవాడ ఎంపిటిసి కణేకల్లు జయరామిరెడ్డి, కాశీంసాబ్, సిద్దాపురం సర్పంచి ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.










