
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా బొడ్డేపల్లి కష్ణారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌పి ఆర్ గంగాధర్‌రావు అనంతపురం జిల్లా 14వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో ఎసిబిగా పనిచేస్తున్న కష్ణారావును అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని పరిస్థితులను ఆయన అధికారులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. గతంలో పులివెందుల ఎఎస్‌పిగా పనిచేశానని కాబట్టి ఈ ప్రాంతంపై మంచి పట్టు, అవగాహన ఉందని తెలిపారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు మొదటి ప్రా ధాన్యత ఇస్తానని అన్నారు. మరింత మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.